YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వణికిపోతున్నారు.... పడిపోయిన టెంపరేచర్

వణికిపోతున్నారు.... పడిపోయిన టెంపరేచర్

హైదరాబాద్,నవంబర్ 30,
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చలి తీవ్రత చంపేస్తుంది. చేతులు కూడా గడ్డకట్టుకుని పోయే విధంగా చలి తీవ్రత ఉండటంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొద్ది రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల చలిగాలుల తీవ్రత ఎక్కువయిందని అంటున్నారు.. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పటాన్ చెర్వులో 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఆలస్యంగా బయలుదేరుతున్నారు. సూర్యుడు కూడా ఉదయం పన్నెండు గంటలకు గాని బయటకు కనిపించడం లేదు. మార్నింగ్ వాకర్స్ కూడా చలి ఇబ్బంది పెడుతుండటంతో బయటకు రావడం లేదు. అదే సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు చలిగాలుల తీవ్రతకు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చలిగాలుల తీవ్రత పెరిగినందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో చలితీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌ 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మెదక్‌ 11.4, పటాన్‌ చెరులో 12.2 డిగ్రీలు, హనుమకొండ 13.5, రామగుండం 13.8 డిగ్రీలు. నిజామాబాద్‌లో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. చలిగాలుల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరంతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదవుతున్నాయి. అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికే అనేక మందిచికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Related Posts