YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

భారంగా మారుతున్న ఎంపీ ఎన్నికలు

భారంగా మారుతున్న ఎంపీ ఎన్నికలు
రాష్ట్ర విభజనానంతరం జరిగిన పరిణామాలతో అనుభవం ఉన్న నేత అయితేనే రాష్ట్రానికి న్యాయం చేయగలరని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. అలాగే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది. ఇదంతా జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయి కూడా. వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ గురించి చెప్పుకుంటే బలహీనంగా ఉన్న చోట ఇప్పటికే పోటీ చేసే వారిని నిర్ణయించిన సీఎం.. వాటిలో పట్టు సాధించాలని సూచించారు. అలాగే సులభంగా గెలిచే చోట మాత్రం ఇంకా ఎవరికీ టికెట్లు కన్ఫార్మ్ చేయలేదు.గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోటలనే చెప్పాలి. ఎందుకుంటే 2014లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే జై కొట్టారు. కేవలం ఈ రెండు జిల్లాల్లోనే టీడీపీకి 34 స్థానాలకు గానూ, 29 సీట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. 15 స్థానాలున్న ఈ జిల్లాలో టీడీపీ(14)-బీజేపీ(1) కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఒకటి, బీజేపీ ఒకటి గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇదే జిల్లాలో టీడీపీ బలం కొంచెం తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రం టీడీపీనే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఏలూరు సిట్టింగ్‌ టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈయన వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేయనని స్వయానా చంద్రబాబుకే చెప్పారట. ఎంపీ పోటీ ఆర్థికంగా తలకు మించిన భారం కావడం, కొన్ని నియోజకవర్గాల్లో వర్గాల సమస్యలు ఎదురు కావడంతో ఆయన కొంత నిరాసక్తత కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆయన ఆరోగ్యం ఈ మధ్య కొంచెం క్షీణించింది. అప్పటిలా ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు. ఎంపీగా పోటీ చేయకపోతే ఆయన కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే లోక్‌సభ సీటు యువ నేత బోళ్ల రాజీవ్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత టీడీపీ సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు. రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు.

Related Posts