YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీఏల దగ్గరే... అంతా కేసుల ఉచ్చు

పీఏల దగ్గరే... అంతా కేసుల ఉచ్చు

శ్రీకాకుళం, డిసెంబర్ 3,
రాజకీయ నాయకులకు వ్యక్తిగత కార్యదర్శులు ఎంతో కీలకం. నేతల డెయిలీ రొటీన్, ఇతరాత్ర వ్యవహారాలన్నీ ఆ పీఏలే చూస్తుంటారు. అందుకే నాయకుల రాజకీయ జీవితంలో పీఏలు భాగమవుతుంటారు. సాధారణంగా ఆ పీఏలకు తెలియకుండా నేతల జీవితాల్లో ఏదీ జరగదు. అందుకే ఆ పీఏలను టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేతల గుట్టు బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వం స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తుంది.తాజాగా మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శాఖ, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. కృష్ణ దాసు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళీ పీఏగా పని చేశారు. కృష్ణ దాస్‌కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మురళీ ఆస్తుల వివరాలు చూస్తే కళ్లు తిరిగాల్సిందే. గొండు మురళికి చెందిన 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్‌ విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. ఆ ఆస్తులు మురళీ అక్రమార్జనా? లేకపోతే ఆయన ఎవరికైనా బినామీనా అన్న దానిపై విచారణ జరుగుతుందంట.ఇప్పటికే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు భూ రికార్డుల దహనం కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన పీఏలు శశికాంత్, తుకారం ఇళ్లలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పీఏ శశికాంత్ ఇంట్లో భారీగా దస్త్రాలు గుర్తించిన పోలీసులు.. నాలుగు బాక్సుల్లో కీలక దస్త్రాల స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ భయంతో పెద్దిరెడ్డి అధికారిక పీఏ తుకారాం ఇప్పటికే విదేశాలకు పారర్‌ అయినట్లు తెలుస్తోంది.మరో వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. అతను దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అతను అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌, అనిత, మంద కృష్ణమాదిగ, షర్మిల తదితరులపై వైసీపీ సోషల్‌ మీడియా ఆధ్వర్యంలో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపై అందిన ఫిర్యాదుల మేరకు వైసీపీ సోషల్‌ మీడియా జిల్లా కో-కన్వీనర్‌ వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి మరికొందరిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అదే కేసులో బండి రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.ఆ క్రమంలో నేతల పీఏల వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్‌లో హాటా టాపిక్‌గా మారింది. నేతల గురించి అన్ని విషయాలు తెలిసిన పీఏలను వ్యూహాత్మకంగానే టార్గెట్ చేస్తున్నారని.. వారిని టార్గెట్ చేసి పెద్ద చేపలకు గాలం వేయడానికి స్కెచ్ గీస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Related Posts