కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే చదిని వ్యక్తికి ఏకంగా ఉన్నత విద్యాశాఖ బాధ్యతలనే అప్పగించారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. శాఖల కేటాయింపు విషయంలో పలువురు అసంతృప్తిగా ఉన్న విషయంపై కుమారస్వామిని ప్రశ్నించగా ‘కొందరు కొన్ని డిపార్ట్‌మెంట్లలో పనిచేయాలని కోరుకుంటారు. కానీ ప్రతీ శాఖలో సమర్థవంతంగా పనిచేయడం ముఖ్యం. మేం అందుకు ప్రయత్నిస్తున్నాం. ఉన్నత విద్యాశాఖ, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు మించి మెరుగైన శాఖ ఉంటుందా’? అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు తమకు కీలక శాఖలు కేటాయించాలని డిమాండ్ చేస్తారు.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కుమారస్వామి నియమించారు. కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన వ్యక్తికి కీలకమైన ఉన్నత విద్యా శాఖను ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. దీనిపై సీఎం కుమారస్వామి మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయనకు విద్యాశాఖ కేటాయించడాన్ని సమర్థించుకున్నారు. ‘నేను చదువుకుంది ఏంటి? నేను ముఖ్యమంత్రిగా ఎన్నిక కాలేదా, పనిచేయలేదా’ అని అన్నారు. మరోవైపు శాఖ కేటాయింపులపై అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. కీలకమైన ఈ నిర్ణయాలు పార్టీ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. మంత్రి వర్గ విస్తరణలో తొలుత ఇలాంటివి మామూలేనని కుమారస్వామి కొట్టిపారేశారు. దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖను అప్పగించడంపై విమర్శలు గుప్పిస్తుంటే, ఆయన మాత్రం ఈ శాఖను కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం సిద్ధ రామయ్యను చాముండేశ్వర నియోజకవర్గంలో దేవెగౌడ ఓడించారు. ఆయనపై 50 వేల పైచిలుక ఓట్లతో గెలుపొందారు. మంత్రి పదవి ఆశించిన కాంగ్రెస్ నేతలు సైతం అధిష్ఠానంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బీఎం పాటిల్ తన మద్దతుదారులతో కలిసి సరిసన తెలియజేశాడు.