YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లుకలుకలపైనే ఆశలన్నీ

లుకలుకలపైనే ఆశలన్నీ

విజయవాడ, డిసెంబర్ 3,
వైసీపీ అధినేత జగన్ కు భవిష్యత్ కనిపించడం లేదు. కూటమి పార్టీలు కలిసి ఉన్నంత కాలం జగన్ కు విజయావకాశాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా. బలమైన సామాజికవర్గాలు కలసి ఉండటంతో పాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కూటమి పార్టీలకు ఉన్నంత కాలం జగన్ ప్రతిపక్ష స్థానానికే పరిమితమవ్వాలన్న భావన ఏర్పడుతుంది. ఇద్దరు బలమైన రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలైన చంద్రబాబు,పవన్ కల్యాణ్, మరో జాతీయ నేత అయిన మోదీ, అమిత్ షాలను తట్టుకుని ఎన్నికలలో విజయం సాధించడం జగన్ కు అంత సులువు కాదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. సునామీలా ప్రజలు తమ వైపునకు తిరిగితే తప్ప గెలుపు సాధ్యం కాదన్నఅభిప్రాయం నెలకొంది. 2019 ఎన్నికలు వేరు. అప్పటి వరకూ జగన్ పాలనను ఎవరూ చూడలేదు. అందుకే ఒక్క ఛాన్స్ అంటే జగన్ కు అవకాశమిచ్చారు. ఆ ఎన్నికల్లో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేశాయి. అందుకే జగన్ పార్టీకి అంతటి విజయం సాధ్యమయింది. కానీ 2014, 2024 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మాత్రం కూటమి పార్టీలను జనం ఆదరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. అందుకే కూటమి పార్టీలు కలసి ఉన్నంత వరకూ జగన్ కు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదన్న కామెంట్స్ ఫ్యాన్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జనంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప జగన్ కు సాధ్యం కాదన్నది సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ వచ్చినా, చంద్రబాబు సీఎం అయినా తమకు ఒరిగేదేమీలేదన్నఅభిప్రాయంలో ఉన్న జనానికి జగన్ ను ఓన్ చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాకపోవచ్చంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం ఎక్కువ. వారంతా ఎక్కువ మంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోనే నడుస్తున్నారు. పవన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారన్న భావన వారిలో కనిపిస్తుంది. ఆ ఆశతోనే పవన్ వెన్నంటి ఉండాలని భావిస్తున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. అక్కడ ఎవరు అత్యధిక స్థానాలను సాధించగలిగితే వారిదే అధికారం అని ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక టీడీపీ వైపు బీసీలు కూడా మొగ్గు చూపుతుండటంతో పాటు మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు, యువత అండగా నిలుస్తుండటంతో పాటు, మోదీ చరిష్మా కలిసి కూటమి పార్టీల విజయానికి కారణమవుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఏపీ అభివృద్ధి చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్న నమ్మకం కూడా ఓట్లు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. Aఅందుకే ఆ మూడు పార్టీలు కలసి ఉండగా జగన్ కు మరోసారి విజయం దక్కదన్నది అందరూ అంగీకరించే విషయం. మూడు పార్టీల్లో ఏ ఒక్కటి విడిపోయి బయటకు వచ్చినా అది జగన్ కు లాభమే.కానీ మూడు పార్టీలకూ ఒకరి అవసరాలు మరొకరికి ఉన్నాయి. ఎవరి ఆలోచనలు వారివి. అంతిమంగా జగన్ ఓడించే లక్ష్యంగా మూడు పార్టీలూ కలసి పనిచేస్తాయి. చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ ను వదులుకోరు. బీజేపీని దూరం చేసుకోరు. అందుకే ఆ మూడు పార్టీలు కలసి ఉన్నంత కాలం జగన్ కు అధికారం దరి చేరడం కష్టమేనన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. అందులోనూ ఒంటరిగా పోటీ చేేసేజగన్ కు ఎన్నికల సమయంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదురుకాక తప్పవు. అందుకే కూటమి పార్టీల కలయికపైనే జగన్ భవిష్యత్ ఆధారపడి ఉందన్నది వాస్తవం. అందుకే జగన్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ కోరుకోవాల్సింది. కూటమి పార్టీలు విడిపోవాలని కోరుకోవడం తప్ప మరేంచేయలేని పరిస్థితి.

Related Posts