హైదరాబాద్, డిసెంబర్ 3,
ఏసీబీ అధికారులే షాక్ అయిన పరిస్థితి. ఇరిగేషన్ శాఖలో అస్టిసెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్..ఏఈఈగా పనిచేస్తున్న నిఖేశ్ కుమార్ అవినీతి బాగోతం భాగోతం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా మారింది. రెండు మూడ్రోజుల నుంచి ఆయన కరప్షన్ స్టోరీ మీదే డిస్కషన్ జరుగుతోంది. ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో నిఖేశ్‌కు సంబంధించి ఏకంగా 200 కోట్ల రూపాయల అవినీతి అక్రమాస్తులు బయటపడ్డాయి. దాంతో ఏఈఈ పోస్టులో అంతగా వెనకేసుకునే అవకాశం ఉంటుందా చర్చ జరుగుతోంది. నిఖేష్ డిపార్ట్‌మెంట్‌లో చేరి కూడా పట్టుమని పదేళ్లు పూర్తి కాలేదు. కానీ అతని అవినీతి బాగోతం మాత్రం..సరికొత్త రికార్డు సృష్టించింది. నిఖేశ్ కుమార్ ఇరిగేషన్ శాఖలో 2013లో విధుల్లో చేరాడు. ఎక్కువ సమయం ఆయన సిటీ శివారు ప్రాంతాల్లోనే పనిచేశాడు. ఇదే నిఖేశ్‌కు కాసుల వర్షం కురిపించింది. నగరు శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు, వెంచర్లకు ఎన్వోసీ తప్పనిసరి అవుతుంది. మరీ ముఖ్యంగా చెరువులు కుంటల దగ్గరుండే రివర్ వ్యూ వెంచర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. వీటన్నింటికి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో దీన్నే అవకాశంగా మల్చుకున్న ఏఈఈ నిఖేశ్ కుమార్..పైఆఫీసర్లకు వాటాలను సెట్ చేసి..పనికానిచ్చేవాడట. పైఆఫీసర్లు కూడా తమ చేతికి మట్టి అంటకుండా కాసులు వచ్చిపడుతుండటంతో నిఖేశ్ ఆగడాలకు ఫుల్ సపోర్ట్ చేశారట.భారీ లంచాలకు రుచిమరిగిన నిఖేశ్ యాజ్‌టీజ్‌గా ఒక ఫైల్ విషయంలో పెద్ద మొత్తంలో డిమాండ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మణికొండ నెక్నంపూర్‌కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి కన్‌స్ట్రక్షన్ ఎన్‌వోసీ కోసం ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఉపేంద్రనాథ్ ఫైల్ క్లియర్ చేయడం కోసం 2 లక్షల 50వేలు డిమాండ్ చేశాడు.మొదటి విడతగా దాదాపు 2లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఉపేంద్రనాథ్ ఏసీబీని ఆశ్రయించాడు. అలా లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఏఈఈ నిఖేశ్‌తో పాటు ఏఈ భన్సీలాల్, సర్వేయర్ గణేశ్‌లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. దీని తర్వాత అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఏసీబీ రైడ్స్‌లో పట్టుబడిన ఈ అధికారిపై..డిపార్ట్‌మెంట్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్‌లో చాలా అవినీతి బాగోతాలు బయటికి వచ్చాయట. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను తన బినామీల పేరిట పెట్టినట్లు గుర్తించారట. దీంతో నిఖేశ్ కుమార్ నివాసంతో పాటు ఆయన బినామీలుగా ఉన్న 19 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఊహించిన దానికంటే ఎక్కువ అవినీతి బాగోతం బయటపడింది. ఏకంగా 200 కోట్ల విలువ చేసే ఆస్తులు ఏసీబీ రైడ్స్‌లో బయటపడ్డట్లు చెబుతున్నారు.
ఓ చిన్న స్థాయి అధికారే ఈ రేంజ్‌లో అక్రమాస్తులు సంపాదిస్తే..పైలెవల్ ఆఫీసర్ల పరిస్థితి ఏందటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇలా అక్కడక్కడ ఎవరైనా అధికారి పట్టుబడినప్పుడు నాలుగు రోజులు చర్చించి లైట్ తీసుకోవడం తప్ప..కరప్షన్‌ను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయలేరా అన్న చర్చ జరుగుతోంది. అయితే నిఖేశ్ దగ్గర ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగు చూడటంతో పోలీసులు విస్తుపోయారు.నిఖేశ్ సింగిల్ విండో సిస్టమ్‌లో పైఅధికారుల వాటాను డీల్ చేసే వ్యవహారం బయటపడటంతో..ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. నిఖేష్ ఇంతగా రెచ్చిపోవడానికి సహకరించిన పై అధికారుల ఎవరనే అంశాన్ని తేల్చాలని చూస్తున్నారు. అయితే ఈ కేసు వెలుగులోకి రావడంతో నిఖేశ్‌కు సహకరించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. చూడాలి మరి ఈ అవినీతి బాగోతంలో ఎలాంటి అనకొండలు బయటకు వస్తాయనేది