YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్న చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్న చంద్రబాబు

  బద్వేలు
సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ 7వ మహాసభ కామ్రేడ్స్ పి.మోక్షమ్మ, కె.యన్. బాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి .చంద్రశేఖర్ మహాసభను ప్రారంభిస్తూ మాట్లాడుతూ... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్.డీ.ఎ. కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నది ఆరోపించారు. లోకాయుక్త, కొప్పర్తి డెవలప్మెంట్ సెంటర్, ఆంధ్ర గ్రామీణ బ్యాంకును, మెడికల్ కాలేజీ సీట్లు లాంటివి అమరావతికి తరలించుకుని పోయారని ఆరోపించారు, తీవ్ర కరువు ప్రాంతమైన రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, వామికొండ, సర్వరాయ సాగర్ కింద పంటకాలవల పూర్తికి నిధులు 2024-25 బడ్జెట్లో ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. అభివృద్ధి అనేది కేంద్రీకరిస్తున్నారని, వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీభాగ్ ఒప్పందం  ప్రకారం హైకోర్టు రాయలసీమలో పెట్టాలని, అయినా పెట్టడం లేదన్నారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి , కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం అడగడం మానేసిందని వారు గుర్తు చేశారు. జిల్లాలో 28 మండలాలు కరువుతో విలవిలాడుతుంటే, ఒక్క మండలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలంగా  ప్రకటించలేదని ఇది వివక్షత అని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా కృష్ణ వాటర్ సీమలోని మెట్ట ప్రాంతాలకు రావడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఏర్పాటు రాయలసీమ ప్రజల చిరకాల కోరికను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. మహాసభల్లో పట్టణ కార్యదర్శి శ్రీను నివేదిక ప్రవేశపెట్టారు, బద్వేల్ పట్టణ సమగ్రాభివృద్ధిపై  తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, జి.శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
నూతన కమిటీ కె.ఎస్, ఎం.వి, కుమార్, కే.ఎన్.బాబు, ఎస్.రాయప్ప, ఎస్.షరీఫ్, పి.మోక్షమ్మ, కే.యస్.కుమార్, సి.సుబ్బరాయుడు, ఎస్.కైరున్ బి, ఎం.చిన్ని, జి.అనంతమ్మ, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Related Posts