ములుగు
ములుగు కేంద్రంగా దాదాదపు 200 కిలోమీటర్ల మేరకు బుధవారం ఉదయం 07:27గం సమయంలో రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. గడచిన మూడు దశాబ్దాలలో... తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో, డక్కన్ పీఠ భూముల్లో భూకంపాలు ఏర్పడే అవకాశం అధికంగానే ఉంటుందని పేర్కొంటున్నారు నిపుణులు.