అమృత్ సర్
పంజాబ్ గోల్డెన్ టెంపుల్లో కాల్పులు కలకలం రేపాయి.
సిక్కు మతస్థులు స్వర్ణమందిరాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తున్నస సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు ప్రయత్నించాడు. కాల్పులను సుఖ్బీర్ సింగ్ బాదల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో సుఖ్బీర్ సింగ్ బాదల్ సురక్షితంగా బయటపడ్డారు. చుట్టుపక్కల ఉన్న మిగతా అనుచరులు వచ్చి తుపాకీ లాక్కుని దుండగుడుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు.