గుడివాడ
రావి టెక్స్ టైల్స్ పై దాడి కేసులో తొమ్మిది మంది వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేసారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ పరారీలో వున్నాడు. గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని అనుచరుల వరుస అరెస్ట్ లు జరుగుతున్నాయి. తొమ్మిది మంది వైకాపా యువ నేతలను గుడివాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు.
2022 డిసెంబర్ 25న.. టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్ల దాడి చేసి అరాచకం సృష్టించినట్లు పిర్యాదు నమోదయింది. కేసులో 143, 144, 145,188, 427, 506, రెడ్ విత్ 149 బీఎన్ఎస్ సెక్షన్ల కింద అరెస్టులు చేపట్టారు. బయట రాష్ట్రానికి ఖాళీ పరారైనట్లు గుర్తించిన పోలీసులు, ప్రత్యేక బృందంతో గాలింపు చేస్తున్నారు. అరెస్టయిన వారిలో రాపాక పవన్ కుమార్ @ గర్షణ,మెరుగుమల ఉదయ్ కుమార్, కొండ్రు శ్రీకాంత్ ,నీరుడు భార్గవ్,సుంకర సతీష్ @ మార్కెట్ సతీష్ ,గొంటి అశోక్, రాజ్యబోయిన తాండవ కృష్ణ @ నాని, గొల్ల వెంకటేశ్వరరావు,పండేటి మోషే వున్నారు.