YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పవన్

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పవన్

తిరుపతి, డిసెంబర్ 5,
జనసేనాని అటె పాలనలో, అటు పాలిటిక్స్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నాయకత్వానికి సిసలైన బ్రాండ్ గా మారారు పవన్. తన స్థాయి ఏంటో, స్టామినా ఏంటో దేశానికి పరిచయం చేశారు. కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒక్కడిలా ఎదిగారు పవన్.  ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన వెళ్లే రకం పవన్. ఆ గుణమే ఆయనను లీడర్ గా నిలబెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ పై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా మారబోతున్నారా? పవన్ ఏది అడిగినా మోదీ సర్కార్ వెంటనే ఓకే చెబుతోంది కూడా అందుకేనా? ఎన్డీయేలో పవన్ ఈ రేంజ్ ప్రాధాన్యత వెనక అసలు కారణం ఏంటి? రాజకీయంగా పవన్ కల్యాణ్ అడుగులు ఇకపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఢిల్లీ టూర్ తర్వాత తెరమీదకు వస్తున్న ప్రశ్నలు ఏంటి?పవన్ కల్యాణ్ అనేది పేరు మాత్రమే కాదు.. ఓ ఎమోషన్. చాలామంది అభిమానులు, అనుచరులు చెప్పే మాట ఇది. రాజకీయ నాయకుడు కాదు రాజకీయం తెలిసిన నాయకుడు అని పవన్ గురించి గర్వంగా చెబుతుంటారు ఫ్యాన్స్. దానగుణం, సమస్యలపై స్పందించే తీరు.. రాజకీయాలకు అతీతంగా ఆయనను నిజమైన లీడర్ గా నిలిపింది. ఈ క్రేజే కోట్ల మంది అభిమానులకు కారణమైంది. ఆయన మాటను శాసనంగా మార్చింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఆయన ఓ మాట అన్నా, ఓ నిర్ణయం తీసుకున్నా ఆ రేంజ్.. ఇంకో లెవెల్ అంతే. అదే ఇప్పుడు ఎన్డీయేకు కలిసి వస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ కు ఎన్డీయే ఎక్కడ లేని ప్రాధాన్యం కల్పిస్తోంది. కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒక్కడిలా చూస్తోంది. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పడానికి కారణం కూడా అదే.పవన్ ప్రచారం చేస్తే చాలు.. ఓట్లు వచ్చి పడుతున్నాయి. మహారాష్ట్రలో అదే జరిగింది. పవన్ ప్రచారం చేసిన ప్రతీ చోట ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించింది. పవన్ ప్రచారం వల్లే గెలిచామని ఎమ్మెల్యేలు బహిరంగంగా చెబుతున్నారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా కనిపించిన పవన్.. విజయంలోనూ అదే స్థాయి పాత్రను పోషించారు. ఈయన పవన్ మాత్రమే కాదు.. తుపాను అని స్వయంగా ప్రధాని మోదీ అంతలా పొగిడింది అందుకే. సొంత ప్రభుత్వంలోని లోపాలను కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఎత్తి చూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై పవన్ స్పందించిన తీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనూ ప్రకంపనలు క్రియేట్ చేశాయి.

Related Posts