ప్రొద్దుటూరులో టీడీపీ ఇంచార్జీ వరదరాజులురెడ్డి, ఎంపీ సీఎం రమేష్ మధ్య నెలకొన్న వివాదం తీవ్రస్థాయికి చేరింది. అధికారపార్టీలోనే నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోందనుకుంటే పొరబడినట్లే. ఇక్కడ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రతి అభివృద్ధి పనిలోనూ ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నిలుస్తున్నారు. అధికార పక్ష నేతలు అభివృద్ధి చూపుతున్నామంటూ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నించి చివరకు చతికిలబడుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల చోటుచేసుకున్న రెండు కీలక ఘటనలే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. రెండు నెలల క్రితం ప్రొద్దుటూరు పురపాలిక తాగునీటి ట్యాంకు నిర్మాణ వ్యవహారంతో వివాదం తెరపైకి వచ్చింది. ఇక్కడ పురపాలిక కార్యాలయం ఎదురుగా గాంధీపార్కులో అమృత్ పథకంలో భాగంగా తాగునీటి ట్యాంకు నిర్మించేందుకు పురపాలిక అధికారులు ముందుకొచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బహిరంగంగా అభ్యంతరం తెలిపారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మొత్తం ఉద్యానవనం 3 ఎకరాలుంది. ఇందులో 22 సెంట్ల మేర ట్యాంకు కోసం వెచ్చిస్తే పార్కు కుచించుకుపోతుందని ఎమ్మెల్యే అభ్యంతరం చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట నిర్మించాలంటూ ఆయన కోరుతున్నారు. కొన్నిరోజులుగా ఇక్కడ ఏకంగా బహిరంగంగానే వరద దూషణలకు దిగుతున్నారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో వాటాల కోసం వెంపర్లాడుతున్నారంటూ సీఎం రమేష్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రమేష్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. వరద విమర్శలకు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రతివిమర్శలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు రెండుసార్లు సీఎం రమేష్‌పై వరద విరుచుకుపడ్డారు. ప్రతిసారీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫలితంగా ప్రొద్దుటూరులో తెదేపా వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఒక నాయకుడు విభేదిస్తుండగా.. మరొకరు మద్దతిస్తున్నారు. పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో ఇక్కడ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా కార్యకర్తలు నేతల మధ్య అంతర్గత కలహాలు చూస్తూ ఇబ్బందిపడుతున్నారు. ఎవరికి మద్దతివ్వాలో తెలియని స్థితిలో తలపట్టుకుంటున్నారు. జిల్లా పార్టీపైనా రాజకీయం.. రసవత్తరం ఈ ప్రభావం కనిపిస్తోంది. సర్దిచెప్పి, సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా పార్టీ నేతల గణం ప్రేక్షకపాత్రకే పరిమితం అవుతుండటం గందరగోళానికి దారితీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలోనే ప్రొద్దుటూరు రాజకీయం చర్చలో నిలుస్తోంది. అధిష్ఠానం కూడా మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కొందరు అధికారపక్ష కౌన్సిలర్లు ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబీకులు, కొందరు కౌన్సిలర్ల మధ్య వివాదం తలెత్తింది. ఇరుపక్షాలు కేసుల వరకు వెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్థానిక తెదేపా ముఖ్యనేతలు జోక్యం చేసుకున్నారు. జిల్లా మంత్రిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి చూపించారు. ఇక్కడే ట్యాంకు నిర్మిస్తామని ప్రకటించారు. ఇలా మలుపులు తిరిగి ప్రస్తుతం ఈ వ్యవహారం స్తబ్దుగా ఉండిపోయింది.