YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీని కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది వైఎస్ షర్మిలా రెడ్డి

ఏసీబీని  కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది  వైఎస్ షర్మిలా రెడ్డి

విజయవాడ
అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది.  సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింది.  ఈ విషయాన్ని అమెరికా ఎఫ్బీఐ  వెల్లడించింది.  ఆధారాలు కూడా బయట పెట్టిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. గురువారం ఆమె పార్టీ నేతలతో కలిసి ఏసీబీ కార్యాలయం ముందు పంజరంతో నిరసనకు దిగారు.
షర్మిల మాట్లాడుతూ ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ?  ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ?  2021 లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ  ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారు.  ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు.  రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు.  అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.  కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు.  అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు?  జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే. అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది.  ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది.  రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు.  సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే... మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ?  2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు.  - చంద్రబాబు ను అడుగుతున్నాం. అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?  అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదని అన్నారు.
అదానీ బీజేపీ మనిషి..మోడీ మనిషి. బీజేపీ తో మీకు అలయెన్స్ ఉంది.  అందుకే మీరు అదానీ కి, మోడీ కి బయపడుతున్నారు.  అదానీ నీ కాపాడుతున్నారు.  రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు. జేపీసీ  వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా మోడీనోరు విప్పడం లేదు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు.  అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు ?  ఈ అవినీతి బయట పెట్టని సిబిఐ చేతకానిదా?  మోడీ చేతకాని వాడా ?  ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఏసీబీ కి పిర్యాదు చేసింది.  దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏసీబీ  స్వయం ప్రతిపత్తి గల సంస్థ.  కానీ రాష్ట్రంలో ఏసీబీనిబంది చేశారు. పంజరంలో చిలక మాదిరిగా బంధి చేశారు.  టీడీపీ  పంజరంలో ఏసీబీ  బందీ అయ్యింది .ఏసీబీ నీ వెంటనే విడుదల చేయండి. ఏసీబీ ప్రజల కోసం ఉన్న సంస్థ.  ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలని అన్నారు.
 ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ చార్జీల భారం మోపారు. ఈ డీల్ వల్ల 1.50 లక్షల కోట్ల భారం పడుతుంది.  చంద్రబాబు ..మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. జగన్ తన సొంత ప్రయోజనం కోసం డీల్ చేస్తున్నారు. ఆయనకు మీకు తేడా లేదు.  ప్రజలు కూటమి నీ నమ్మి రాత్రి 9 గంటల దాకా లైన్లో నిలబడి ఓట్లు వేశారు.  ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండని అన్నారు.

Related Posts