YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు అప్రజాస్వామికం..

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు అప్రజాస్వామికం..

జమ్మికుంట
మాజీ మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ అన్నారు.  గురువారం రోజున స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అవుతున్న ఆరు గ్యారెంటీల ను అమలు చేయకపోవడం వాటి మీద ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారు అని ప్రజాస్వామ్యబద్ధంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న సిఐ దరఖాస్తు తీసుకోకుండా కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టే విధానంగా మాట్లాడి గురువారం  తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటిముందు పోలీసులను మోహరించి అక్రమ అరెస్టు చేయాలని చూస్తున్న పోలీస్ అధికారులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఉన్నారు ఎప్పుడు ఒక్కటే ప్రభుత్యం ఉండదు అని అధికారులు గుర్తుంచుకోవాలి అని అన్నారు,  మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకోసమే పనిచేస్తాం మీరు చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా ఊరుకునేది లేదు అని అన్నారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts