YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి నిర్వహించనున్నట్టు గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
తెలంగాణ పలు అంశాలు ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈనెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
సంక్రాంతి తరువాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించారు. అయితే, అందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా. అర్హులైన రైతులకే దక్కేవిధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్‌ చట్టంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్‌ వస్తారా? లేదా? అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Related Posts