న్యూఢిల్లీ
కెవి. రావు పెద్ద బ్రోకర్ అని 2018 లో పవన్ కళ్యాణ్ చెప్పారు. కె.వి. రావుకు పోర్టును తిరిగి కట్టబట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసుల ఈ కుట్ర అని వైకాపా ఎంపి విజయ సాయి రెడ్డి అన్నారు. నాపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వాల్సిందే. ఏ మాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు లుక్ అవుట్ నోటీస్ ఇచ్చాడు. మా ఇమేజ్ దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు పైన పరువు నష్టం దావా వేస్తా. చంద్రబాబు, లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారని అన్నారు.