విజయవాడ
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.
అజిత్ సింగ్ నగర్ రూప లక్ష్మి సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పొట్టకూటికోసం పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ పై ఒక తాగుబోతు దాడికి దిగాడు.
కృష్ణ హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన గంజాయి బ్యాచ్ సభ్యుడు బార్ లో మద్యం సేవించి బయటికి వచ్చి సిగరెట్ ఇవ్వమని విజయ్ కుమార్ ని డిమాండ్ చేసాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ చొక్కా పట్టుకొని షాపులోంచి బయటికి ఈడ్చుకువచ్చి దాడి చేసాడు. పోలీసులు నన్నేం చేయలేరు అంటూ మాజీ వాలంటీర్ పై పిడిగుద్దులతో దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ కు కూత వేటు సమీపంలోనే ఇలాంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి.