విశాఖపట్నం
టెక్నాలజీ పరంగా ఏపీని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.విశాఖ వేదికగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ ) నిర్వహిస్తున్న నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు కు ముఖ్య మంత్రి చంద్రబాబు హాజరైయ్యారు.వివిధ అంశాలపై 5 సెషన్లుగా జరిగే సదస్సులో ఆయా రంగాల్లో నిపుణులతో చర్చలు నిర్వహించారు.టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అంశాలు అజెండాగా సదస్సు జరిగింది.