హైదరాబాద్ డిసెంబర్ 6
డిసెంబర్ రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.శుక్రవారం నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సభను దేశవ్యాప్తంగా ప్రజానీకమంతా జరుపుకుంటున్నారు.రాజ్యాంగాన్ని కాపాడండి అని కొంత మంది రాజకీయ వక్తలు కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, పార్లమెంట్లో అడుగు పెడుతున్నప్పుడు రాజ్యాంగానికి మొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తానని ప్రతిజ్ఞ పునిన మహనీయుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు.ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద, సమస్త ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆశయాలని గుర్తు చేసుకొని వాటిని అమలు చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.