YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజన్ 2047 పై ఫోకస్ చంద్రబాబు నాయుడు

విజన్ 2047 పై ఫోకస్ చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం
విశాఖ వేదికగా డీప్ టెక్నాలజీ సదస్సు-2024  ప్రారంభ మైంది.ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ.. విజన్ 2047పై ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ప్రపం చంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, సాంకేతికత లో అనేక నూతన మార్పులు వచ్చాయని , సాంకేతికత అంశంపై గతంలో అనేక సదస్సులు నిర్వహిం చామని అన్నారు. మన జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తా మని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్గా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అన్నారు. ఆధార్ సాంకేతికత అనేది భారత్లోనే ఉందని, ఆధార్ అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తాయని, రాష్ట్రం సాంకేతిక తకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంద న్నారు. నూతన సాంకేతిక ఆవిష్క రణలకు ఇతర దేశాలు పోటీపడు తున్నాయన్నారు. 1995లో హైదరా బాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేశామని, పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీ నిర్మాణం చేశామన్నారు. ప్రస్తు తం డ్రోన్లు కీలకంగా మారాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts