విజయవాడ, డిసెంబర్ 7,
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విజయవాడలో ఇళ్ల అద్దెలు పెరిగాయి. అమరావతి రాజధానిపై గత ప్రభుత్వం మీమాంస గత ఐదేళ్లుగా కొనసాగించిన నేపథ్యంలో గతంలో విజయవాడ వేదికగా వ్యాపారాలు నిర్వహించాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా, ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి వెనకడుగు వేయవలసిన పరిస్థితులు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించేలాగా ముందడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సెంటర్ ఆఫ్ ది పాయింట్‌గా ఉన్న విజయవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్య, వ్యాపారం,ఉద్యోగ అవసరాల కోసం వస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతుంది. గత ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకోవాలన్నా హైదరాబాద్ నుంచి ఉద్యోగాల కోసం రాష్ట్రం తర్వాత ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులు ఇక్కడ శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలన్నా వెనకడుగు వేశారు. దీంతో గత ఐదేళ్లుగా ఉద్యోగస్తులు మొత్తం కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వేదికగా తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్న వారంతా విజయవాడ కేంద్రంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం గానీ అద్దెకు ఉండేందుకు కానీ ముందుకు రాలేదు. వారంలో ఐదు రోజులు పాటు విధుల్లో పాల్గొని చివరి రెండు రోజులు తిరిగి హైదరాబాద్ వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గత ఐదేళ్లు కనిపించాయి. ముఖ్యంగా విజయవాడలో 2014-2019 మధ్య ఇళ్ల కోసం కార్యాలయాల కోసం భవనాలు సైతం దొరకని పరిస్థితులు ఉండేవి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులు సైతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు సైతం అద్దెలు భరించలేక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే తాజాగా 2024 ఎన్నికల్లో ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం విజయవాడ కేంద్రంగానే కార్యకలాపాలను విస్తరించడంతో తాజాగా అద్దెలు మళ్ళీ పెరిగాయవిజయవాడకు రవాణా పరంగా అన్ని అవకాశాలు ఉండటంతో చాలామంది విజయవాడ నగరం కేంద్రంగానే ఉండేందుకు ఇటీవల ఆసక్తి చూపిస్తున్నారు. నగరం చుట్టుపక్కల ఎటు చూసినా ఐదు కిలోమీటర్ల లోపే విస్తరించి ఉండటం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా కూడా 20 నిమిషాలు మాత్రమే సమయం పడుతుండటంతో విజయవాడలో నివాసాలను మళ్ళీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ట్రాన్స్పోర్టేషన్‌కు ఈజీగా ఉండటంతో విజయవాడకు ఎక్కువమంది మళ్ళీ తిరిగి వలస వస్తున్నారు. అయితే వీటన్నిటికీ కారణం కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గత కొంతకాలంగా విజయవాడ కేంద్రంగా నిర్మాణరంగం పూర్తిగా వెనుకబడింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగం ఊపొందుకోవడంతో ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా విజయవాడ కేంద్రంగానే నివాసాలను, కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.టెక్ , ఫైనాన్స్, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సెక్టార్‌లో ఉన్నా తమ కార్యకలాపాలను విజయవాడలో మళ్ళీ తిరిగి విస్తరిస్తున్నారు. దీనితో కొంత కాలంగా ఇళ్లను ఖాళీగా ఉంచుకొని ఎదురు చూపులు చూసిన వారంతా ఫుల్ ఖుషిలో ఉన్నారు. ప్రస్తుతం డిమాండ్ దృష్ట్యా ఇంతకాలం ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఒక్కసారిగా అవకాశాలు వచ్చాయని భావించి ఇంటి అద్దెలు పెంచేశారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే కనీసం రూ.15000 నుంచి రూ.25 వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే అయితే రూ.25 నుంచి 60 వేల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. అయితే వీటికి అదనంగా మెయింటెనెన్స్‌తో పాటు ఇతరత్రా ఛార్జీలు సైతం వసూలు చేస్తున్నారు. అద్దెలు పెరిగాయన్న బాధ కొంతమేరకు ఉన్నా కూడా నగరం అభివృద్ధి చెందడం వేగంగా విస్తరించడంతో ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లోనే అద్దెలు పెంచుతున్నామని యజమానులు అంటున్నారు. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు రెండు జిల్లాలకు విజయవాడ కేవలం బోర్డర్‌గా ఉండటంతో వచ్చే వారి సంఖ్య వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం ఉన్నంత మేరకు అన్ని వసతులతో పాటు అందుబాటులో ఉండేలాగా విజయవాడ నగర కేంద్రంగా ఉండటంతోనే అద్దెలు ఎంతైనా దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.