YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు...

మంత్రులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు...

విజయవాడ, డిసెంబర్ 7,
కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు అర్థసంవత్సరపు పరీక్షలు ముగుస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిపై సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలు ఉంటాయి. నిర్ణీత కాలం సర్కారుపై ప్రజలు సానుకూల ధోరణితోనే ఉంటారు. అయితే ఇప్పుడు మంత్రుల హనీమూన్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ క్రమంలో మంత్రుల ప్రోగ్రెస్‌పై సీఎం చంద్రబాబు రిపోర్ట్ కోరారంట. దాంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఈ ఆరు నెలల పరీక్షల్లో పాస్ అయ్యేది ఎవరు? ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబరు 12తో ఆరు నెలలు నిండుతున్నాయి. అంటే హానీమూన్ కంప్లీటెడ్ అన్న మాట. ఏ ప్రభుత్వం మీద కొత్తగా ఏర్పడినప్పుడు ప్రజల అంచనాలు, ఆశలు భారీగానే ఉంటాయి. తొలి ఆరు నెలలు ఆశావహ ధృక్పధంతో ఎదురుచూస్తారు. ప్రభుత్వ పనితీరును సానుకూల ధోరణిలోనే చూస్తూంటారు.అయితే తర్వాత పాలన ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు. ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్దలు కూడా తమ వంతు సమీక్షలు ఎప్పటికపుడు చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం అయితే లేనే లేదు అని అంటున్నారు. ఆయన ప్రజల నాడిని ఎప్పటికపుడు పట్టుకోవడానికే చూస్తూంటారన్న అభిప్రాయం ఉంది.అదలా ఉంటే సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఆయన కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో అరడజను మంది తప్ప అంతా కొత్త ముఖాలే ఉన్నారు. అందుకే బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు అధ్యయనం చేస్తున్నారు. తనదైన పద్దతిలో రివ్యూస్ రెడీ చేయించుకుంటూ నివేదికలను తెప్పించుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు.ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతీ మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు అడిగారంట. అలాగే ఆయా శాఖల పరిధిలో వ్యవహారాలు, మంత్రుల పనితీరుపై తనదైన పద్దతిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారంట. వాటినన్నిటినీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజులలలో పనితీరుని మెరుగుపరచుకోవడానికి సూచనలు ఇస్తారని అంటున్నారు.మొత్తం మంత్రులలో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారని అంటున్నారు. మరి కొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారన్న అభిప్రాయం ఉంది. కొందరు మంత్రులు మాత్రం ఇంకా ఏ, బీ, సీ, డీలో దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారంట. దీంతో ఆరు నెలల పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తారంటున్నారు.ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే బాబు పదే పదే మంత్రులను తమ పనితీరుని మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారుONE . ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలో హఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్‌లో మంత్రుల ప్రోగస్ రిపోర్టులు ఎలా ఉంటాయో చూడాలి.

Related Posts