YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుంభ మేళా కు ఆహ్వానం పలుకుతున్నాం.. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య

కుంభ మేళా కు ఆహ్వానం పలుకుతున్నాం.. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య

విజయవాడ
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కు ఘన స్వాగతం పలికారు. బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బిజెపి నేతలు స్వాగతం పలికారు. ఈసందర్భంగా బిజెపి నేతలు ను ఉద్దేశించి ప్రసంగించారు  .
తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను. దుర్గా మాత అంటే శక్తి మాతను దర్శనం చేసుకున్నానని ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భాషణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగు లు పెడుతుందన్నారు.పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బిజెపి జాతీయ స్థాయిలో బలం గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్ కా సాద్ నినాదం తో అభివృద్ధి పధం వైపు తీసుకుని వెళుతున్నారు 2047 వికసిత్ భారత్ లక్ష్యం గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని చేస్తున్నారు
మహా రాష్ట్ర లో మూడవ సారి అద్భుతమైన విజయాన్ని సాధించాం.ఏక్ హై తో సేఫ్ నినాదం మహా రాష్ట్ర ప్రజల్లో కి తీసుకొని వెళ్ళాం.కాంగ్రెస్ విమర్శలు ను ప్రజలు పట్టించుకోలేదు. ప్రయాగ రాజ్ లో మూడు నదులు గంగ యమున సరస్వతి నదుల సంగమం. 2025 జనవరి లో మహా కుంభమేళ నిర్వహిస్తున్నాం.40 కోట్ల మంది భక్తులు వస్తారు వారి కి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహా కుంభమేళ కు ఆహ్వానం పలుకుతున్నాని అన్నారు.
ఈ సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం అధ్యక్షత వహించారు. 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తదితరులు పాల్గొన్నారు

Related Posts