YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

చందా కొచ్చర్ కు సెబీ నోటీసులు

చందా కొచ్చర్ కు సెబీ నోటీసులు
ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ కంపెనీకి ఇచ్చిన రుణ వ్య‌వ‌హారం రోజురోజుకు ముదురుతోంది. ఇందులో నిజానిజాలు తేలేవ‌ర‌కూ కంపెనీ విచార‌ణ స‌మ‌యంలో బ్యాంకు సీఈవో చందాకొచ్చ‌ర్‌ను దీర్ఘ‌కాల సెల‌వుపై పంపించారు. ఇప్పుడు సెబీ దీనికి సంబంధించి బ్యాంకు బోర్డ‌ను వివ‌ర‌ణ కోరింది. ఈ నెల మొద‌టి వారంలోపు తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు పంపాల్సిందిగా కోరింది. గ‌డువులోపు స్పందించ‌ని బ్యాంకు యాజ‌మాన్యం సెబీని మ‌రింత గ‌డువు కోరేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. అయితే సెబీకి ఉన్న నిర్ణ‌యాధికారాల మేర‌కు ఒకవేళ చందాకొచ్చ‌ర్ త‌ప్పు చేసిన‌ట్లు రుజువైతే ఐసీఐసీఐ బ్యాంకుకు జ‌రిమాన విధించ‌వ‌చ్చు. అయితే దీన్ని చందాకొచ్చర్ వేత‌నం నుంచే చెల్లించాలి. కానీ చందాకొచ్చ‌ర్ రాజీనామాను కోరే హ‌క్కు సెబీకి లేద‌ని తెలుస్తోంది. గ‌రిష్టంగా రూ.25 కోట్లు లేదా మోసానికి మూడు రెట్ల సొమ్మును పెనాల్టీగా విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న ఇద్ద‌రు అధికారులు వెల్ల‌డించారు. 

Related Posts