YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి

విజయవాడ, డిసెంబర్ 10,
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు... పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా...జనసేన నుంచి నాగబాబు పేరు వినిపించింది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడంతో...ఆయనకు మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మందిని మంత్రులుగా నియమించవచ్చు. ప్రస్తుత కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన మూడు మంత్రి పదవులు తీసుకుంది. ఆ పార్టీ నుంచి పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నాదెండ్ల మనోహర్‌ మంత్రులుగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. మిగిలిన ఒక్క మంత్రి పదవిని తాజాగా జనసేన నుంచి ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబును కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని ఎంపిక చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్య పేరును ఖరారు చేసిది. టీడీపీ బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లు ఖరారు చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ టీడీపీ చేరారు. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు మళ్లీ వారికే ఛాన్స్ దక్కుతుందని భావించగా...లిస్ట్ లో ఓ పేరు మారింది. మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని సానా సతీష్‌ కు కేటాయించింది టీడీపీ. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. మరోస్థానాన్ని మాత్రం బీద మస్తాన్ రావుకు కేటాయించింది.ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

Related Posts