YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

విశాఖపట్టణం, డిసెంబర్ 10,
ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 'ఆపరేషన్ గరుడ' చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది. ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది. దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు. ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో డ్రగ్స్ కలిపివున్నట్లు అనుమానిస్తున్నామని, అందులో భాగంగానే కంటైనర్‌ను సీజ్ చేసినట్లు మార్చి 21న విడుదల చేసిన ప్రకటనలో సీబీఐ పేర్కొంది. ఎనిమిది నెలల తర్వాత, ఆ కంటైనర్‌‌లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని, కేవలం డ్రైడ్ ఈస్టేనని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. పోర్టులో డ్రైడ్ ఈస్ట్ కంటైనర్‌లో డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు అనుమానించామని, ఆ తర్వాత శాంపిల్స్‌ను పరీక్షకు పంపగా.. వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని రిపోర్టు వచ్చినట్లు కోర్టుకు ఇచ్చిన నివేదికలో సీబీఐ పేర్కొంది. డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 ప్రకారం 2024 మార్చి 22న కేసు (u/s 52-A) నమోదు చేసి కంటైనర్ నుంచి సేకరించిన 100 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించాం. దీనికి సంబంధించిన ఫలితాలను దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) జూన్ 21న అందజేసింది. ఇందులో ఎటువంటి నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కానీ లేవని పేర్కొంది" అని సీబీఐ విశాఖ ఎన్డీపీఎస్ కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత, సీజ్ చేసిన కంటైనర్‌ను సంధ్య ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, సంధ్య ఆక్వా కంపెనీకి అప్పగించినట్లు విశాఖ కస్టమ్స్ అధికారులు తెలిపారు."సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో ఎలాంటి డ్రగ్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు తేలలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన క్లోజర్ రిపోర్టులో పేర్కొంది. దాంతో మేం కంటైనర్‌ని విడుదల చేశాం" అని విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపాల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న సమయంలో.. అంటే, ఈ ఏడాది మార్చి 21న విశాఖ పోర్టులో 25 టన్నుల డ్రగ్స్ దొరికాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విశాఖలో దొరికిన అనుమానిత డ్రగ్స్ కంటైనర్ పైనే చర్చ జరిగింది.మరోవైపు రాజకీయ పార్టీలు ఈ కంటైనర్ మీదంటే, మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి.ఆ కంటైనర్‌ను ఆర్డర్ చేసిన సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు మాత్రం తమకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.బ్రెజిల్‌లోని డ్రైడ్ ఈస్ట్ సప్లై చేసే కంపెనీకి విశాఖపట్నంలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌‌ను విశాఖకు డెలివరీ చేయాలంటూ ఆర్డర్ పెట్టింది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరిన కంటైనర్ మార్చి 16న విశాఖ చేరుకుంది. బ్రెజిల్ నుంచి ఒక్కో బ్యాగు 25 కేజీల చొప్పున 1000 బస్తాలతో డ్రైడ్ ఈస్ట్ ఉన్న కంటైనర్ విశాఖకి చేరుకుంది. అయితే, ఈ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ నుంచి తమకు సమాచారం అందిందని సీబీఐ పేర్కొంది.విశాఖ పోర్టుకు మార్చి 16న కంటైనర్ (ఎస్‌ఈకేయూ-4375380) చేరుకుంది. సీబీఐ ఈ కంటైనర్‌ను చెక్ చేసి.. దానిలో ''డ్రగ్స్ కలిపి ఉన్నట్లు అనుమానాలున్నాయని'' పేర్కొంటూ ఈ కంటైనర్‌ను సీజ్ చేసింది. విశాఖలోనే సిరిపురం అడ్రస్‌లో ఉంటున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులను పిలిచి వారి ఎదుటే పరీక్షలు నిర్వహించి.. అనుమానస్పద పదార్థాలను తాము ''గుర్తించామని'' చెప్తూ సీబీఐ ఈ కంపెనీపై కేసు నమోదు చేసింది.బ్రెజిల్‌లోని సాంటోస్ పోర్ట్  నుంచి విశాఖ చేరుకున్న కంటైనర్‌లో ఒక్కొక్కటి 25 కిలోల బరువున్న 1,000 బస్తాల డ్రైడ్ ఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ ఉన్నాయని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో డ్రగ్స్ కలిపి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు సీబీఐ మార్చి 21న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది."మాకు సమాచారం అందగానే కంటైనర్‌ని సీజ్ చేసి కేసు నమోదు చేసి 100 నమూనాలు సేకరించాం. వాటిని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం" అని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.ఆ శాంపిల్స్ ఫలితాలే 21 జూన్ లో సీబీఐకి అందగా.. వాటి ఆధారంగా కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్టులో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని చెప్తూ సీబీఐ విశాఖపట్నం (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కోర్టుకు తెలిపింది.కంటైనర్‌ను పట్టుకున్నప్పటి నుంచి విశాఖ కోర్టుకు నివేదిక అందించడానికి మధ్య ఎనిమిది నెలల కాలం గడిచింది.
ఎన్నికల సమయం కావడంతో సీబీఐ సీజ్ చేసిన ఈ కంటైనర్ అంశంపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడిచింది.సంధ్య ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరికి బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ అరోపించింది. ఇదే సమయంలో వీరిద్దరికీ వైసీపీతో లింకులున్నాయని టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి.

Related Posts