YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

గుంటూరు, డిసెంబర్ 10,
రాష్ట్రంలో పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. అన‌ర్హ‌ుల పెన్ష‌న్లు ఏరివేత‌కు రంగం సిద్ధ‌మైంది. పెన్ష‌న్లను త‌నిఖీ చేసేందుకు పైల‌ట్ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు ముందుకేసింది. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కొ స‌చివాల‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు ముందడుగు వేసింది. ఈ మేరకు సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జి.వీరపాండియన్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పెన్షనర్లను వెరిఫికేష‌న్ చేయ‌నున్నట్లు స్పష్టం చేశారు. పెన్ష‌న‌ర్ల వాస్తవ అర్హత స్థితిని నిర్ధారించడానికి పైలట్ ప్రాతిపదికన.. ఒక గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో పెన్షన్‌ల ధృవీకరణ చేయ‌నున్న‌ట్లు వివరించారు.స‌మాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్ స్పష్టం చేశారు. పేద, బలహీన వర్గాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తీర్చడానికి.. పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. అందుకే అనర్హులను తొలగించి, అర్హులైన వారికి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని వివరించారు.
1. పెన్ష‌న్ల‌ ఫిజిక‌ల్ ఫీల్డ్ వెరిఫికేష‌న్ కోసం సెర్ప్‌ మొబైల్ అప్లికేషన్ రూపొందించింది.
2. జిల్లా కలెక్టర్ల జాబితా ప్రకారం ఒక గ్రామం/వార్డు సచివాలయంలో పింఛన్ల పెన్ష‌న్ల‌ ఫిజిక‌ల్ ఫీల్డ్ వెరిఫికేష‌న్‌ను చేపట్టాలి. ఇత‌ర మండలాల‌ నుండి వెరిఫికేష‌న్ బృందాన్ని నియ‌మించాలి. వెరిఫికేషన్ సిబ్బంది ఎంపిక చేసిన మండలంలో గతంలో పనిచేసి ఉండకూడదు.
3. ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్లు వెరిఫికేష‌న్ అధికారులు/సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఒక బృందానికి 40 మందిని కేటాయించాలి. ఎంపిక చేసిన సచివాలయంలో పెన్షనర్ల సంఖ్య ఆధారంగా బృందాలను ఏర్పాటు చేయాలి. బృందంలో మండల స్థాయి అధికారి, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి ఉండాలి. వెరిఫికేష‌న్ అధికారి, సిబ్బంది వివరాలను ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలి.
4. వెరిఫికేష‌న్‌ అధికారి మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సిబ్బంది పెన్షనర్ ఇంటికి వెళ్లి ప్రశ్నపత్రం ప్రకారం వివరాలను వెరిఫై చేయాలి. ఆపై వాటిని మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. పెన్షనర్ ఫోటో, ఆధార్ అథెంటికేష‌న్‌ రసీదు వ‌స్తుంది. దానికి వెరిఫికేష‌న్‌ అధికారి మొబైల్ యాప్‌లో ఆయ‌న‌/ఆమె వివ‌రాల‌ను సబ్మిట్ చేయాలి.
5. ఫిజికల్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఒక రోజులోపు పూర్తి చేయాలి.
6. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫిజిక‌ల్ ఫీల్డ్ వెరిఫికేష‌న్‌కు హాజ‌రవుతారు. వెరిఫికేష‌న్ ప్రక్రియను సమన్వయం చేస్తారు.
7.సంబంధిత విభాగానికి చెందిన డివిజన‌ల్ లెవల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌ (డీఎల్‌డీవో)లు వెరిఫికేష‌న్ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. పింఛనుదారుల వాస్తవ స్థితిని ప‌ర్య‌వేక్షిస్తారు.
8. పైలట్ వెరిఫికేష‌న్ డిసెంబ‌ర్ 10లోగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయాలి

Related Posts