
శ్రీనగర్
శీతలకాలం కావడంతో కాశ్మీర్ ను మంచు కమ్మేస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నిలిపిన వాహనాలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణాలు ప్రమాదకరంగా పరిణమించాయి. టూరిస్ట్ స్పాట్ బుద్దాంలోని దూధ్పత్రిలో సాయంత్రం 5 గంటలకు మంచులో కూరుకుపోయిన రోడ్డుపై నుంచి కారు జారుకుంటూ ఎలా వెళ్లిందో వీడియోలో చూడొచ్చు