YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్‌ 100 శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాబడబోమని హెచ్చరించారు. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ‘మేం ఏమన్నా పిగ్గీ బ్యాంకులమా.. అందరూ మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నారు. .‘భారత్‌లో మా వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారు. కానీ మేం విధించడం లేదు. మేం అలా వసూలు చెయ్యలేకపోతున్నాం. అందుకే వివిధ దేశాలతో మాట్లాడుతున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు. అనంతరం అధిక సుంకాలు వసూలు చేస్తున్న విషయం గురించి మాట్లాడుతూ భారత్‌ విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. ఇదే కాకుండా ట్రంప్‌ చైనా, యూరోపియన్‌ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక శాతంలో సుంకాన్ని విధిస్తున్నారు. దీంతో ఆయా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొంటోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్నహార్లీడేవిడ్సన్‌ బైకులపై భారత్‌ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

Related Posts