పలనాడు
జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ ను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,స్వఛ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాభి పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, ప్లాంట్ కు వస్తున్న వేస్టు తదితర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్రనారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామార్థ్యంతో జిందాల్ ప్లాంట్ నిర్మాణం చేశారు. వేస్ట్ నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వేస్ట్ ఎక్కడిక్కడ పేరుకుపోకుండా చేయవచ్చని అన్నారు.
స్వఛ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాభి మాట్లాడుతూ ప్లాంట్ ఏర్పాటు లో చంద్రబాబు, నారాయణ కృషి ఎంతో ఉంది. విదేశాల్లో ఉన్న సాంకేతికను పరిశీలించిన తర్వాత నారాయణ ఈ ప్లాంట్ నిర్మాణం చేయించారు. చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఇటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. గత ప్రభుత్వం 85 వేల టన్నుల చెత్తను మన నెత్తిన వేసి వెళ్ళింది. ఏపిని ఘన వ్యర్థాల ట్రిట్ మెంట్ లో ఒక మోడల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014_19 మధ్య చాలా స్టడీ చేసిన తర్వాత వేస్ట్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వైసిపి చెత్త ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లను వదిలేసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్ నుండి చెత్తను ఈ ప్లాంట్ కు తరలిస్తున్నారు. 6890 మెట్రిక్ టన్నుల చెత్తలో 2500 టన్నుల చెత్తను రెండు ప్లాంట్స్ ద్వారా విద్యుత్ గా మారుస్తున్నారు. కాకినాడ, నెల్లూరులో త్వరలో ప్లాంట్ లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం ఒక్క ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయలేదు. చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ట్రిట్ చేయాలన్నది గత ప్రభుత్వానికి తెలియదు. చెత్త పన్ను తీసేశాం... చట్ట సవరణ చేసి మరీ చెత్త పన్ను తొలగించాం. అమృత్ పథకానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయాం. టన్ను చెత్తను ట్రీట్ చేయాలంటే 500 నుండి 750 రూపాయల ఖర్చవుతుంది. ఆ ఖర్చు తగ్గించాలంటే చెత్త తరలించడమే మార్గమని అన్నారు.