అల్లూరి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న కారును మావోయిస్టులు తగులబెట్టారు. కారుని ఆపి దానిలో ఉన్న ప్రయాణికులను దింపి తరువాత కారుకు నిప్పు పెట్టారు. ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.