విశాఖపట్నం
రష్యాలో తయారైన అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషీల్ భారత నేవీ అమ్ములపొదిలోకి చేరింది. సోమవారం రష్యాలోని కాలినిన్ గ్రాడ్ నగరం వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఫ్రిగేట్‌ను భారత చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠికి లాంఛనంగా అప్పగించారు. భారత్‌లో ముంబై కేంద్రంగా పనిచేసే భారత నౌకాదళం పశ్చిమ విభాగానికి ఈ ఫ్రిగేట్‌ను అందిస్తారు. ఇది హిందూ మహాసముద్ర జలాల్లో మోహరించనున్నారు.చైనా ఆర్మీ దూకుడుకు కళ్లెం వేసేందుకుగానూ ఐఎన్ఎస్ తుషీల్ ను హిందూ మహాసముద్ర జలాల్లో మోహరించనున్నారు.నాలుగు స్టెల్త్ ఫ్రిగేట్ల నిర్మాణం కోసం 21వేల కోట్లతో 2016లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.భారత్-రష్యాల మధ్యనున్న బలమైన సంబంధాలకు రక్షణ రంగ సహకారమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.