గుంటూరు, డిసెంబర్ 12,
సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్కను సార్ అంటూ..పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతికాలంలో..అందలమెక్కారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి..గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజిని. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా..అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడే రజినిపై తీవ్రస్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక చిలుకలూరిపేటలో రజిని కరప్షన్ ఫైల్స్ బయటికి వస్తున్నాయి.చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమాని బెదిరించి మాజీ మంత్రి రజిని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా.. రజిని పిఎలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని ఆరోపించింది. రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల ఫైన్ పడేట్లుగా విజిలెన్స్ కేసులు బుక్ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో మెన్షన్ చేశారు అధికారులు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విజిలెన్స్ విభాగంపల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు చెబుతోంది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్. అందులో రూ.2 కోట్లు విడదల రజిని, రూ.10 లక్షలు జాషువా, మరో రూ.10 లక్షలు రజిని పీఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ వసూళ్లే కాదు..చిలకూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి 16 లక్షల రూపాయల కమీషన్ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజిని. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేశ్‌కు కొంత మొత్తం తిరిగిచ్చినా..ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఆమెకు వరుస కేసులు..అలిగేషన్స్ తలనొప్పిగా మారాయిపార్టీ అధికారంలో ఉండగా హల్‌చల్ చేసిన మాజీమంత్రి విడదల రజిని, అవినీతి వ్యవహారాలతో డిఫెన్స్‌లో పడిపోయారట. కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్‌కు రెడీ అయ్యారన్న టాక్ వినిపించింది. ఆమె జనసేనలో చేరుతారని వార్తలు వచ్చాయి. అంతలోనే విడదల రజినికి మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్‌తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస కేసులు ఆమెను చుట్టు ముట్టే అవకాశం కనిపిస్తోంది.