YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష, ఎనిమిది నెలల్లో నియామాకాలు - రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు

ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష, ఎనిమిది నెలల్లో  నియామాకాలు - రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు
తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వార భర్తీ చేసే 18,428 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ప్రకటించారు.ఎనిమిది నెలల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిర్వహించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డితో కలిసి  తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది టి-సాట్ ప్రేక్షకులనుద్దేశించి వివి శ్రీనివాసరావు మాట్లాడారు. పలువురు నెటిజన్లు, వీవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పోలీసు ఉద్యోగాలకు హాజరయ్యే వేలాది మంది అభ్యర్థులకు సుమారు గంటన్నర పాటు టి-సాట్ స్టూడియో ద్వార సమాధానాలు చెబుతూ సలహాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో భర్తీ చేస్తున్న పోలీసు ఉద్యోగాలను పారదర్శకంగా, పక్కాగ నిర్వహించేందుకు తమ బోర్డు సిద్ధమైందన్నారు. రాత పరీక్ష, దేహ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగ నియామకాల విషయంలో దళారులను నమ్మవద్దని, ఎటువంటి అనుమానాలు ఉన్నా పోలీసు నియామక బోర్డు హెల్ప్ లైన్, బోర్డు వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు.అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులకు వీలుగా రోజుకు ఏడు గంటలు 60 రోజులు, 400 గంటలు అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామన్నారు. ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల అనుమానాలు తీర్చేందుకు లైవ్ కార్యక్రమాలను కూడా అందిస్తున్నామని, టి-సాట్ ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Related Posts