YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యాదీవెన పథకానికి గ్రీన్ సిగ్నల్

విద్యాదీవెన పథకానికి గ్రీన్ సిగ్నల్

నెల్లూరు, డిసెంబర్ 12,
ఏపీలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాలను త్వరలో పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. దళితులకు రద్దు చేసిన పథకాలను పునరుద్దరించనున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయులు ప్రకటించారు.రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామాన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు.
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ. 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామన్నారు.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామన్నారు.గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని మూడు ముక్కలు చేసి నిధులు అందివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. లిడ్ కాప్ కు నిధులు అందించి రుణాలు అందిస్తామాన్నారు. విజయవాడ ఆటోనగర్ లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని, అక్కడ పిపిపి మోడల్ లో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ రిపేరుకు రూ.140 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.ఐదు నెలల పాలనలో హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి, వారి ఆరోగ్యానికి కాపాడే చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వం స్థలాన్ని మార్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహం పెట్టారన్నారు.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న హాల్స్, తదితర పనులను పూర్తి చేస్తామన్నారు.. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్ కి రూ. 42 లక్షల నిధులు కేటాయించామాన్నారు.ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన హాస్టల్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్థులను పట్టించుకోలేదని, విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా డిసెంబర్ నెలలోనే బకాయిలు చెల్లిస్తామన్నారు. నాణ్యతతో కూడిన యూనిఫామ్స్, బ్యాగులను పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందిస్తామన్నారు.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు శానిటేషన్ కి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.. రాబోయే కాలంలో సాంఘిక సంక్షేమ శాఖ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామన్నారు.

Related Posts