YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లెక్క తేలని 90 లక్షల విలువైన బియ్యం

లెక్క తేలని 90 లక్షల విలువైన బియ్యం

విజయవాడ, డిసెంబర్ 12,
మాజీ మంత్రి పేర్నినానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. నాని నిర్వహిస్తున్న గోడౌన్ లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై ఈ కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న ఈ గోడౌన్ నుంచి 90 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు అయిన విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని 1.80 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించడంతో పాటు క్రమినల్ కేసులను ఎదుర్కొనాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. మచిలీపట్నంలో నానికి చెందిన గోదాములో గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని ఉంచారు.నానిపై ఆగ్రహంతో... 2020లో అద్దెకు తీసుకున్న పౌర సరఫరాల శాఖ బస్తాకు ఐదు రూపాయలు చెల్లిస్తుంది. అయితే దాదాపు 90 లక్షల విలువైన బియ్యం మాయం కావడంపై పేర్ని నానిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాని ఏ విషయంలో దొరుకుతారా? అని ఎదురు చూస్తున్న కూటమి సర్కార్ కు బియ్యం మాయమవ్వడం అనువుగా లభించిందని చెబుతున్నారు. నానిపై టీడీపీ నేతలు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. వైసీపీ నుంచి అధికార ప్రతినిధిగా కాకపోయినా మాజీ మంత్రి గా ఆయన చేసే విమర్శలు నేరుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా సూటిగా తగులుతున్నాయి. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీపై విమర్శలు చేయడం కూడా కూటమి సర్కార్ కు మింగుడు పడలేదు. జనసేన కార్యకర్తలు పలుమార్లు మచిలీపట్నంలోని ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. ధర్నాకు దిగారు. అలాంటి నాని పై ఇప్పుడు క్రిమినల్ కేసును నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ఎండీ ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా భారీగా జరిమానా కూడా వసూలు చేయాలని నిశ్చయించింది. దీంతో పాటు నానికి చెందిన గోడౌన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెిపారు. క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయడంతో నానిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద మచిలీపట్నం వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నానిపై క్రిమినల్ కేసు నమోదయి ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related Posts