YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాగబాబుకు సినిమాటోగ్రఫి మంత్రి..?

నాగబాబుకు సినిమాటోగ్రఫి మంత్రి..?

విజయవాడ, డిసెంబర్ 12,
రాజ్యసభకు వెళ్లాలని అనుకున్న మెగా బ్రదర్ ఆశలకు ఇప్పట్లో అవకాశం లేకపోవడంతో ఏపీ మంత్రి వర్గంలోకి వస్తున్నారా? తన రెండో అన్నయ్య, మెగా బ్రదర్ నాగబాబును ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోకి జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకు వస్తున్నారా? అంటే 'అవును' అని వినబడుతోంది. మరి నాగబాబుకు ఏ మంత్రి పదవి ఇస్తున్నారో తెలుసా? ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు అని ప్రకటన విడుదల చేశారు. అంటే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. శాఖ మాత్రం కేటాయించలేదు. ఆయనకు కేటాయించనున్న శాఖపై ఉత్కంఠ నెలకొంది.మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కావచ్చు... తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మొదలు పెట్టినప్పుడు కావచ్చు... మెగా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి నాగబాబు. గత ఎన్నికల్లో జనసేన తరఫున అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేస్తారని బలంగా వినిపించింది. అయితే, పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి త్యాగం చేయడంతో అప్పట్లో నాగబాబు ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయలేకపోయారు.నకాపల్లి ఎంపీ సీట్లు త్యాగం చేసిన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ భావించారని వినిపించింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. దాంతో అన్నయ్యను ఏపీ మంత్రిని చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. నాగబాబుకు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తున్నారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ దగ్గర ఉంది. దాంతో పాటు ఏపీ టూరిజం శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. ఆ రెండిటిలో దుర్గేష్ దగ్గర టూరిజం ఉంచి సినిమా శాఖను నాగబాబుకు ఇవ్వనున్నారట. మరో వైపు సినిమాటోగ్రఫీ లేదంటే గనుల శాఖ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోందిస్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాటోగ్రఫీ శాఖ ప్రస్తావన వస్తుంటుంది. టికెట్ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేయాల్సింది సినిమాటోగ్రఫీ శాఖ దగ్గరకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు వెళుతున్నారు. సినిమా వర్గాల్లో సినిమాటోగ్రఫీ శాఖకు విలువ ఉంటుంది.

Related Posts