రాజమండ్రి
రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుండి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి ఈ సర్వీస్ లను కేంద్ర విమానాలు శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈవిమానం ఉదయం 6.30గం.కు ఢిల్లీ నుంచి మధురపూడికి, ఇక్కడి నుంచి ఉదయం 9.30గం.లకు ఢిల్లీకి బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేల రెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు...