విశాఖపట్నం
విశాఖ జీవిఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకటకుమారి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో.... 46 ప్రధాన, 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది.క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ,స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు.అవగాహన లేని అధికారులతో మేయర్ పని చేస్తున్నారని టిడిపి సభ్యులు విమర్శించారు.మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు.