YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాలం చెల్లిన వాహానాలపై దృష్టి

కాలం చెల్లిన వాహానాలపై దృష్టి

న్యూఢిల్లీ, డిసెంబర్ 13,
వస్తువుకైనా.., వాహనానికైనా.., చివరికి మనిషికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా.. సరే మనిషిని పక్కన పెడితే వాహనాల ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో ఎందుకో తెలుసా.. ఆ తర్వాత కూడా వాడితే ఏమవుతుందో తెలిస్తే వెంటనే వాటిని విడిచిపెడతారు. అయితే గతంలో అయితే అలానే జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. వీటిని తిరిగి ఇచ్చి మరో బైక్ పై రాయితీలను పొందవచ్చు. కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. షోరూం నుంచి బయటకు వచ్చిన తర్వాత 15 ఏండ్లు పూర్తయిన వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. వీటిని స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేసుకుంటే రాయితీలు వస్తాయి. ఈ విషయంపై ఇటీవల అధికారులు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్లలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. 15 ఏండ్లు నిండిన వాటిని స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేసుకుంటే రాయితీలు పొందచ్చనని ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఎక్స్ పైరీ వెహికిల్స్ వేలాదిగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నారు. ఇవన్నీ రోడ్లపై చక్కర్లు కొడుతూ పొల్యూషన్ పెంచుతున్నాయి.కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటితో ముఖ్యంగా పర్యావరణం కలుషితం అవుతుంది. కాలుష్యం పెరుగుతుంది. 15 ఏళ్ల వాహనం అంటే ఇంజిన్ మొత్తం మరమ్మతుకు గురవుతుంది. ఈ విధంగా ఇంజిన్ నుంచి పొగలు వచ్చి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇక అధిక శబ్ధం చేస్తుంది కాబట్టి శబ్ధ కాలుష్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత బ్రేకులు పరిగా పడక తోటి వాహదారులు, బాటసారులను కూడా ఢీ కొనే ప్రమాదం ఉంటుుంది. కాబట్టి కాలం చెల్లిన వాహనాన్ని స్క్రాప్ కు పంపించాలని అధికారులు ఆదేశిస్తూనే ఉన్నారు.కాలం చెల్లిన వాహనాల విషయంలో అధికారులు తనిఖీల్లో కొన్ని పట్టుబడుతున్నాయి. ఇందులో చాలా వరకు స్కూల్‌ బస్ లు, కార్లు, బైకులు ఉంటుంటున్నాయి. గడువు ముగిసినా ఇంకా ఇవి రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకుంటూ ఫైన్లు వేస్తున్నారు. స్క్రాపింగ్‌ ఉపయోగాలను కూడా వివరిస్తున్నారు. ట్రాన్స్‌ పోర్ట్‌ కు సంబంధించిన వాహనాలు 20 ఏండ్ల లోపు స్క్రాప్‌ చేస్తే.. ఏటా పన్నుపై 10 శాతం రాయితీ కలుగుతుంది. సొంత వాహనం 15 ఏండ్ల తర్వాత స్వచ్ఛందంగా స్క్రాప్ కు వస్తే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ వర్తిస్తుంది. దీనిలో భాగంగా రెండేళ్లలోపు అదే విలువ గల వాహనం కొంటే మోటార్ వెహికిల్ (ఎంవీ) ట్యాక్స్‌లో మినహాయింపు వస్తుంది. ఈ అంశాలపై వాహనదారులకు విరివిగా అవగాహన కల్పిస్తున్నారు.

Related Posts