
చెన్నై
తమిళనాడుపై అల్పపీడనం ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. తమిళనాడులో మరోసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని 17 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు.. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.