రంగారెడ్డి
జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై చేసిన దాడికి నిరసనగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 143 నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు.
మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని, గాయపడ్డ జర్నలిస్టుకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.