హైదరాబాద్
రాష్ట్రపతి ముర్ము పర్యటనకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవనం ముస్తాబవుతోంది. మూడు రోజులపాటు రాష్ట్రపతి ముర్ము ఇక్కడినుంచే విధులు నిర్వహించనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో నగరానికి రానున్నారు. ఈనెల 18,19 తేదీలలో రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 20న సికింద్రాబాద్ సైనిక్ పురిలోని సీడీఎం కాలేజీలో నిర్వహించే కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఎట్ హోం, ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, నేతలు, వివిధ రంగాకలు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. 21న ఉదయం కోఠీ మహిళా కళాశాలను సందర్శించి అక్కడి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళతారు. రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో ఈనెల 10నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సందర్శనలను నిలిపివేశారు.