
బద్వేలు
ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తో పాటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం అభినందనీయమని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే క్లాస్ వన్ కాంట్రాక్టర్ మంచూరుసూర్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపిందని ఇది హర్షించదగ్గ విషయమన్నారు. లోక్ సభ తో పాటు దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన కేంద్రం తీసుకురావడం క్యాబినెట్ ఆమోదించడం శుభ పరిణామం అన్నారు. భారతదేశ ప్రధాని మోడీ ఆయన మంత్రివర్గం ఈ బిల్లు ఆమోదంలో తీసుకున్న చొరవ తెగువ చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.