ఆళ్లగడ్డ
ఉయ్యాలవాడ మండలం గోవింద పల్లె గ్రామంలో సోలార్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గోన్నారు.
ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి గ్రామంలో 400 కోట్ల నిధులతో ఆళ్లగడ్డ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సోలార్ ఇండస్ట్రీ ప్లాంటును నిర్మించడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు..
మా అమ్మ శోభనాగిరెడ్డి జయంతి నా కొడుకు వీర నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ ఇండస్ట్రీ కి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆళ్లగడ్డ చరిత్రలో ఇది గుర్తుండిపోయే రోజు.....
ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా 5000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ మాట విని చాలామంది ఎన్నో రకాలుగా అనుకున్నారు కానీ ఆరు నెలలు పూర్తి అవ్వకముందే సోలార్ ప్రాజెక్టును ఆళ్లగడ్డకు తీసుకురావడం జరిగింది ఇందులో 300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు... ఆంధ్రప్రదేశ్ అంతట ఎస్ ఏ ఈఎల్ కంపెనీవారు పదిచోట్ల ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న గారితో మాట్లాడగా ఆ పది సోలార్ ప్లాంట్లలో ఆళ్లగడ్డకు ఒకటి రావడం అనేది ఆళ్లగడ్డ నిరుద్యోగ యువతీ యువకులకు మంచి శుభవార్త.
ఆళ్లగడ్డలో జరుగుతున్న అభివృద్ధి వైసిపి నాయకులు ఎప్పుడూ మాట్లాడరు ఏమైనా అంటే గొడవలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటున్నారు రైతులు పండించే మంచి పంటల గురించి మాట్లాడరు ఫ్యాక్షన్ నుంచి రైతులుగా మారిన ప్రజల గురించి మాట్లాడు కేవలం ఎప్పుడు వాళ్ల స్వార్థం కోసం బురదజల్లే మాటలే మాట్లాడుతారు. రైతులకు అన్యాయం జరిగిందంటూ వైసీపీ నాయకులు కలెక్టర్ ను కలశారు అక్కడికి వెళ్లిన వారందరూ రైతుల భూముల లాక్కున్నవారు నాసిరకం సీడ్ ఇచ్చినవారు రియల్ ఎస్టేట్లో మోసం చేసిన వారే తప్ప ప్రతిపక్ష హోదా కలిగిన వారు ఎవరూ లేరు... గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వైసిపి నాయకుడు ఏమి చేతకాక మీరు ఏమైనా చేసుకోండి నాకు కమిషన్ ఇస్తే చాలు అంటూ అంగన్వాడి పాలు గుడ్లు అన్నింటిలోనూ కమిషన్ తీసుకొని ఈరోజు ఏం మాట్లాడకుండా ఉన్నాడు ఏం పని పాట లేని ఒకరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆళ్లగడ్డ ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఆళ్లగడ్డలో నిరుద్యోగ యువతీ యువకులు ఎవరు లేకుండా చూసుకుంటామని మాట ఇచ్చిన ప్రకారం హామీలన్ని నెరవేరుస్తామని ఈ ఇండస్ట్రీ ఇక్కడకి వచ్చినందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అన్న కి మా ధన్యవాదాలని అన్నారు.