YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ప్రోజెక్టు పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి

ప్రోజెక్టు పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి
పోలవరం ప్రోజెక్టుకు సంబందించి డయాఫ్రం వాల్ పనులలో ప్రధానమైన జెట్ గ్రౌంటింగ్ పనులను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధిికార్లను ఆదేశించారు. పోలవరం ప్రోజెక్టు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించిన అనంతరం ప్రోజెక్టు సైట్‌లోని సమావేశం హాలులో అథికార్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగాచంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రోజెక్టు మొత్తం పనులలో ఇంతవరకు 55.12 శాతం మేర పనులు పూర్తయ్యాయన్నారు. గతవారంలో 0.4 శాతం మేర పనులను పూర్తయ్యాయని పనులన్నీ వేగాన్ని సునామితో ముఖ్యమంత్రి పోల్చారు. పోలవరం ప్రోజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ప్రోజెక్టు పనులను వారం వారి లక్ష్యాలను నిర్దేశించి, ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించడం జరిగిందని,ఈ విషయంలో ఎ టువంటి మార్పునకు తావులేదన్నారు. ప్రోజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబందించి 41 శాతం, ప్రధాన డ్యాం పనులకు సంబందించి 39.43 శాతం, కుడి ప్రధాన కాలువ 89.96 శాతం, ఎ డమ ప్రధాన కాలువ పనులు 60.92 శాతం, జెట్ గ్రౌంటింగ్ పనులు 85.90 శాతం మేర పనులు పూర్తయ్యయన్నారు. కాంక్రీట్ పనులకు సంబందించి ఒక్కరోజులోనే 11 వేల 158 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి చేసి ఇంజనీర్లు రికార్డు సృష్టించారన్నారు. స్పిల్‌వే లో 5 కోట్ల 27 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయని, ఇంకా కోటి 22 లక్షల పనులు పూర్తికావలసి ఉందన్నారు. ప్రోజెక్టు మట్టిపనులను త్రివేణి సంస్థ మరింత వేగవంతం చేయవలసి అవసరం ఉందన్నారు. స్పిల్ వే, డ్యాం, గేట్లకుసంబందించి 45 డిజైన్లలో 14 డిజైన్లకు అనుమతి మంజూరైందని, మిగిలిన డిజైన్లను అనుమతి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పోలవరం ప్రోజెక్టుపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి సంబందించి డిజైన్ల అనుమతి పనులను త్వరితగతిన పూర్తి చేసి, బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంబించే దిశగా అధికార్లు చర్యలు తీసుకోవాలన్నారు. జెట్ గ్రౌంటింగ్ పనులు జూన్, 25వ తేదీ నాటికి, గ్యాలరీ పనులు సెప్టెంబరు మొదటివారంలో పూర్తి చేయాలని, అక్టోబరు రెండవ వారంలో మొదటి రేడియల్ గేటును బిగించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రోజెక్టు నిర్మాణానికి ఎ టువంటి నిధుల కొరత లేదని, వాతావరణం అనుకూలించే సమయంలోగా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రోజెక్టుకు సంబందించి మొత్తం కాంక్రీట్ పనులు 2019 మే నాటికి, డ్యాం పనులు 2019 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రోజెక్టు వచ్చే అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డా.కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పోలవరం ప్రోజెక్టు భూసేకరణ పనులు పూర్తయ్యాయని, నిర్వాసితుల ఇళ్ల కాలనీకి టెండర్ల పని పూర్తయిందని, భూమి మెరక, రోడ్ల సౌకర్యం నిర్మించి మరో 8 నెలల్లో నిర్వాసితులకు కాలనీలు నిర్మాణం పూర్తిచేసి, కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిదేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, శాసనసభ్యులు మొడియం శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, బుూరుగుపల్లి శేషారావు, బడేటి కోటరామారావు, గన్ని వీరాంజనేయులు, వేటుకూరి వెంకట శివరామరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభృతులు పాల్గోన్నారు.

Related Posts