YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు టూ గోదావరి... పందెం కోళ్లు... రెడీ

నెల్లూరు టూ గోదావరి... పందెం కోళ్లు... రెడీ

నెల్లూరు, డిసెంబర్ 17, 
సంక్రాంతి అంటే పందెం కోళ్ల చిందులు గుర్తుకొస్తాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కోళ్ల పందాలు చాలా జోరుగా భారీ ఎత్తున జ‌రుగుతాయి. అందుకోసం ఇప్పటి నుంచి సిద్ధం అవుతున్నారు. పందెం కోళ్లను నెల్లూరు జిల్లాలో పెంచి, గోదావ‌రి జిల్లాల్లో అమ్ముతున్నారు.  సంక్రాంతి అంటే పందెం కోళ్లు గుర్తుకొస్తాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కోళ్ల పందాలు చాలా జోరుగా భారీ ఎత్తున జ‌రుగుతాయి. అందుకోసం ఇప్పటి నుంచి సిద్ధం అవుతున్నారు. పందెం కోళ్లను నెల్లూరు జిల్లాలో పెంచి, గోదావ‌రి జిల్లాల్లో అమ్మకాలు మొద‌లయ్యాయి. వీటికి గిరాకీ చాలా ఎక్కువే ఉంద‌ని అమ్మకందారులు చెబుతున్నారు. ఒక్కో కోడి ధ‌ర రూ.4 వేల నుంచి రూ.7 వేల వ‌ర‌కు ప‌లుకుతోంది. స్థానిక పుంజుల కంటే ఇది చాలా త‌క్కువ ధ‌ర‌. ఉభ‌య గోదావ‌రి జిల్లాలకు నెల్లూరు సింహ‌పురి నుంచి కోడి పుంజులు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాల్లో పెంచిన కాకి, నెమ‌లి, డేగ‌, ప‌చ్చకాకి, కేతువ త‌దిత‌ర జాతుల కోడి పుంజుల‌ను గోదావ‌రి జిల్లాల్లో అమ్ముతున్నారు. పందెం రాయుళ్లు ఆయా కోడి పుంజుల‌ను కొనుగోలు చేస్తున్నారు. సింహ‌పురి కోడి పుంజుల‌పై పందెం రాయుళ్లు ఆస‌క్తి చూపుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాపారులు రావుల పాలెం-ఏలూరు జాతీయ ర‌హ‌దారి, ర‌ద్దీ రోడ్ల వెంబ‌డి కోడి పుంజుల‌ను అమ్మకాలు చేస్తున్నారు.సంక్రాంతి వ‌చ్చింద‌టే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడి పందాలే. తూర్పు గోదావ‌రి జిల్లాలో ముర‌మ‌ళ్ల, కాట్రేనికోన‌, వేట్లపాలెం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో భీమ‌వ‌రం, వెంప, సీస‌లి, దుంప‌గ‌డ‌ప ప్రాంతాలు కోడి పందేల‌కు పేరు పొందాయి. అయితే ఇవి కాకుండా ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతాయి. పెద్ద బరుల్లో రోజుకు 20 నుంచి 30 పందాలు జ‌రిగితే, గ్రామాల్లో జ‌రిగే చిన్న వాటికి లెక్క ఉండ‌దు. సంక్రాంతి మూడు రోజుల పాటు జ‌రిగే వేలాది కోడి పందాల‌కు కోడి పుంజులు అవ‌స‌రం అవుతాయి. అయితే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సొంతంగా కోడి పుంజుల‌ను మేప‌డం, వాటికి పందాలను నేర్పడం వంటివి చేస్తారు. అయితే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఉన్న కోడి పుంజులు స‌రిపోగా, ఇత‌ర ప్రాంతాల నుంచి కోడి పుంజుల‌ను తెప్పిస్తారు. కోడిపందేల్లో రంగంలోకి దింపే భీమ‌వ‌రం బ్రీడ్ పుంజుల‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి కోడి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినమిరం, కాళ్ల, కోన‌సీమ‌లోని అమ‌లాపురం, లంక‌, మండ‌పేట‌, రామ‌చంద్రపురం, పెద్దాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో భీమ‌వ‌రం బ్రీడ్ కోడిపుంజుల పెంచుతున్నారు. వీటి పెంప‌కంతో గోదావ‌రి జిల్లాల్లో వంద‌లాది మంది ఉపాధి కూడా పొందుతున్నారు. భీమ‌వ‌రం బ్రీడ్ పుంజుల‌కు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో కూడా కోళ్ల పెంప‌కం దారులు వీటినే అక్క‌డ పెంచుతున్నారు. నెల్లూరు భీమవ‌రం బ్రీడ్ కోళ్ల‌ను పెంచి, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో తెచ్చి అమ్ముతున్నారు. ఇంకో నెల రోజుల్లో సంక్రాంతి పండ‌గ రానుంది. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంప‌కం దారులు, వ్యాపారులు అప్పుడే గోదావ‌రి జిల్లాల్లో కోడి పుంజుల‌ను అమ్మేందుకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్క‌రు 15 నుంచి 20 కోడి పుంజుల‌ను తెచ్చి అమ్ముతున్నారు. న‌లుగురైదుగురు బృందంగా ఏర్పాడి రావుల‌పాలెం-ఏలూరు జాతీయ ర‌హ‌దారి వెంబ‌డి, ఇత‌ర రోడ్ల ప‌క్కన ఖాళీ ప్రదేశాల్లో పందెం కోడి పుంజుల‌ను అమ్ముతున్నారు.పందెం కోళ్ల‌లోని దాదాపు అన్ని ర‌కాల జాతులు నెల్లూరు అమ్మ‌కం దారుల వ‌ద్ద అందుబాటులో ఉన్నాయి. సాధార‌ణంగా పందేల కోసం గోదావ‌రి జిల్లాల్లో సిద్ధం చేసిన పుంజులు చాలా ధ‌ర ఉంటాయి. పందెం పుంజుల‌ను కొత్త అల్లుళ్ల మాదిరిగా దిట్టంగా పెంచుతారు. వాటికి మూడు నెల‌ల ముందునుంచే మ‌ట‌న్ కీమా, డ్రైఫ్రూట్స్‌, ఇత‌ర బ‌లాన్నిచ్చే ఆహారం అందిస్తుంటారు. శ‌రీర బ‌లంగా ఉండేందుకు వాకింగ్‌, ఈత కొట్ట‌డించ‌డం, ప‌రిగెత్తించ‌డం, నీళ్ల పోత‌లు, శాఖాలు త‌దిత‌ర రూపాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.వాటికి అందించే ఆహారం, శిక్ష‌ణ‌ను బ‌ట్టి ఒక్కొక్క పుంజు ధ‌ర రూ.25 వేల నుంచి రూ. ల‌క్ష కూడా దాటి పోతుంది. అదే నెల్లూరు పంజులు అంత భారీ ధ‌ర‌లు ఉండ‌వు. చూడ‌టానికి స్థానిక పుంజుల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటాయి. పంజు రంగు, ఎత్తు, బ‌రువును బ‌ట్టీ వాటి ధ‌ర రూ.4 వేల నుంచి రూ.7 వేల వ‌ర‌కు ఉంటుంది. దీంతో త‌క్కువ ధ‌ర‌కు రావ‌డంతో పందెం రాయుళ్లు కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామ‌ర్థ్యం, ప్ర‌త్య‌ర్థిపై దాడి చేసే వేగాన్ని ప‌రీక్షించేందుకు డింకీ పందేలు క‌ట్టి బాగున్న కోడి పుంజుల‌ను బేర‌మాడి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు వాటికి త‌గిన మేత‌ను అందించి శిక్ష‌ణ ఇచ్చి కోడి పందెల‌కు స‌న్న‌ద్ధం చేస్తారు.

Related Posts