విశాఖపట్టణం, డిసెంబర్ 17,
విశాఖలో వెలుగు చూసిన హనీ ట్రాఫ్ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. కిలాడీ లేడీ జాయ్ జేమియాతో బీజేపీ యువ నేత చేసిన ఓ ఫోన్ సంభాషణ ప్రస్తుతం లీక్ అయింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారానికి చెందిన ఆడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జాయ్ జెమీమా.. హానిట్రాప్ చేయడంలో ఎక్స్‌పర్ట్. ఇప్పుడిమే కేసులో తవ్విన కొద్ది కొత్త కోణాలు.. కొత్త ట్విస్ట్‌లు. లెటెస్ట్‌గా ఓ ఈ కేసులో బీజేపీ యువనేత పేరు ఇప్పుడు బయటికి వచ్చింది. ధనవంతులు, అధికారులు, ఎన్నారైలకు అందమైన ఫోటోలను పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయగా.. తాజాగా కొందరు రాజకీయ నేతలు ఆమెకు సహకరించినట్టు తెలుస్తోంది. కావాలంటే ఈ ఆడియో వినండి.జాయ్ జెమీమాతో అవినాష్ మాట్లాడుతున్న ఆడియో విన్నారుగా. అయితే ఇది నిజంగా ఆవినాష్ మాట్లాడాడా? లేదా? అనేది ఇంకా తెలియలేదు. కానీ ఇప్పుడీ ఆడియో వైరల్‌గా మారింది. ఏం కాదు.. ఏం జరిగినా చూసుకుందాం.. వాళ్లు కేసులు పెడితే.. మనమూ పెడదాం.. వాళ్లు సీపీని కలిస్తే.. మనమూ కలుద్దాం.. వాళ్లు కోర్టుకు వెళితే.. మనమూ వెళదాం.. ఇలా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఆ యువనేత. ఇదే కాదు.. జాయ్ జేమియాకు సంబంధించిన మరో ఆడియో కూడా వైరల్‌గా మారింది.ఈ ఆడియోలో ఆమె ఒకరి కోసం బేరం మాట్లాడుతుంది. అమ్మాయిలు సెట్ చేస్తే మీకేంత? మాకేంత? అంటోంది. రెండుగంటలకు ఎంత? ఎప్పుడు పంపాలి? అంటూ చెబుతోంది.జాయ్ జెమీమా కేసులో ఇలా రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమె వెనక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్టు కనిపిస్తోంది. బడాబాబులకు తన ఫోటోలో, వీడియోలతో ఎర వేయడం.. వారిని ముగ్గులోకి దించి నిండా ముంచడం.. ప్రైవేట్‌గా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరించడం.. బ్లాక్ మెయిల్ చేయడం.. ఇవన్నీ కామన్ అని తెలుస్తోంది.