YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనలోకి మంచు మనోజ్....

 జనసేనలోకి  మంచు మనోజ్....

కర్నూలు, డిసెంబర్ 17, 
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్‌ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ విజయం కోసం ప్రచారం కూడా  చేశారు. తర్వాత కొన్ని రోజులకే ఆ పార్టీ నుంచి దూరంగా జరిగారు. 2024 ఎన్నికల్లో తటస్థంగా ఉండిపోయారు. ఆ ఫ్యామిలీలో విభేదాలు రావడంతో తలో చోట ఉంటున్నారు. మొన్న ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వివాదం కేసులు, కోర్టులు, మీడియాకు చేరింది. వివాదం కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న టైంలో ఆదివారంలో మంచు మనోజ్ మరో బాంబు పేల్చారు. తన ఇంటికి వచ్చిన మంచు విష్ణు తన ఫ్యామిలీకి హాని తలపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. తన ఇంటికి విద్యుత్ సరఫరా చేసే జనరేటర్‌లో పంచదార వేశారని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి హాని జరగకపోయినా కుటుంబానికి ప్రాణ హాని మాత్రం ఉందని ఆరోపించారు. సోమవారం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పిన మనోజ్‌  నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు.. శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని తన రాజకీయ అరంగేట్రం విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మౌనిక తరఫు బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. ఆమె అక్క అఖిల ప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా చేశారు. వాళ‌్ల పేరెంట్స్ కూడా టీడీపీ, వైసీపీ, ప్రజారాజ్యం పార్టీల్లో పని చేశారు. 2014 ఎన్నికల టైంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందారు. ఆమె వారసురాలిగా అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 12 మార్చి 2017న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన అన్న  కుమారుడు బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌ రెడ్డి ఇప్పుడిప్పుడే ప్రజల్లో తిరుగుతున్నారు.   వారి స్ఫూర్తితోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో నంద్యాల వెళ్లిన మంచు మనోజ్, మౌనిక దంపతులు రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని ప్రకటించారు. అక్క, తమ్ముడు, మామయ్య టీడీపీలో వీళ్లు మాత్రం జనసేనలోకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న ఈ కుటుంబంలో విభేదాలు చాలానే ఉన్నాయి. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.

Related Posts