YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో టిక్ టాక్ బ్యాన్...

అమెరికాలో టిక్ టాక్ బ్యాన్...

న్యూయార్క్, డిసెంబర్ 17, 
అమెరికాలో టిక్‌టాక్ కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటికే నిషేధితం అయ్యే ముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పుడు అమెరికన్ చట్టసభ సభ్యులు ఈ యాప్‌ను వారి సంబంధిత యాప్ స్టోర్ల నుండి తీసివేయవలసిందిగా యాపిల్, గూగుల్‌లను ఆదేశించారు. అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను తీసేయాలన్న మాట. ఇందుకోసం రెండు కంపెనీలకు జనవరి 19వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇదే జరిగితే అమెరికాలోని ప్రజలు ఇకపై అఫీషియల్ సోర్స్‌ల నుంచి టిక్‌టాక నుంచి డౌన్‌లోడ్ చేయలేరు. అయితే ఈ నిర్ణయం ప్రస్తుత వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపదు.చైనా కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలో టిక్‌టాక్ ఉంది. ఇప్పుడు బైట్‌డ్యాన్స్ అమెరికాలో తన కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటే టిక్‌టాక్‌ను విక్రయించాల్సి ఉంటుంది. జనవరి 19వ తేదీలోగా టిక్‌టాక్‌ను వేరే దేశానికి చెందిన కంపెనీకి విక్రయించకపోతే దాన్ని నిషేధించే ప్రమాదం ఉంది. టిక్‌టాక్‌ని పౌరుల భద్రతకు ముప్పుగా అమెరికా పరిగణిస్తోంది. బైట్‌డ్యాన్స్ తన యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి చైనా ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించింది.యూఎస్ పార్లమెంట్ కమిటీలోని ఇద్దరు సభ్యులు జాన్ ముల్నర్, భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు లేఖ రాశారు. ఇందులో బైట్‌డ్యాన్స్‌కు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు అది చట్టాన్ని అనుసరించకపోతే అమెరికాలో అలాంటి యాప్‌లను యాక్సెస్ చేయడానికి, నిర్వహించడానికి, అప్‌డేట్ చేసే హక్కు దానికి ఉండదు. అందువల్ల చట్టాన్ని గౌరవిస్తూ గూగుల్, యాపిల్ అవసరమైన చర్యలు తీసుకోవాలి.అమెరికా కోర్టు ఆదేశాల తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు రాసిన ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయాన్ని బైట్‌డ్యాన్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇక్కడి నుంచి ఉపశమనం పొందవచ్చని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. ఇక్కడి నుంచి కంపెనీకి ఉపశమనం లభించకపోతే అమెరికాలో వ్యాపారం చేయడం కష్టంగా మారుతుంది. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు యాప్‌ని ఉపయోగించడం కొనసాగించగలరు. కానీ వారికి ఎలాంటి అప్‌డేట్‌లు లేదా సపోర్ట్ లభించదు.

Related Posts